తమిళనాడు ముఖ్యమంత్రి
జయలలిత నిన్న రాత్రి 11.30గంటలకి అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషయం ఆసుపత్రి
నిన్న అర్ధరాత్రి తరువాత ప్రకటించింది. ఆమె భౌతిక కాయాన్ని ఆమె నివాసం పోయేస్
గార్డెన్ కి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఒమందూర్ రెడ్డియార్ ఎస్టేట్ లోని రాజాజీ హలో ఉంచుతారు. ఈ రోజు సాయంత్రం చెన్నై మెరీనా
బీచ్ లో ఎం.జి.ఆర్. సమాది పక్కనే ఆమెని ఖననం చేస్తారు.
ఆమె స్థానంలో
ఇంతవరకు పదవీ భాద్యతలు నిర్వర్తిస్తున్న పన్నీర్ సెల్వంనే అధికార అన్నాడిఎంకె
పార్టీ శాసనసభ్యులు తమ నాయకుడుగా ఎన్నుకోవడంతో, జయలలిత మృతి చెందిన వార్త అపోలో
ఆసుపత్రి అధికారికంగా ప్రకటించిన తరువాత, గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన చేత అర్దరాత్రి
దాటినా తరువాత రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
జయలలిత మృతికి
సంతాపంగా రాష్ట్రంలో ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు
కూడా మూడు రోజులు శలవు ప్రకటించాయి.