
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ కోసం న్యాయం పోరాటం చేస్తున్న విషయం మీడియాకు పొక్కడంతో మీడియా ప్రతినిధులు దాని గురించి ఆమెను ప్రశ్నించారు. కానీ తాను పార్టీ ప్రారంభించినప్పుడే దాని అజెండా, లక్ష్యాలు వివరిస్తానని సమాధానం దాటవేశారు.
గాంధీజీ సర్వోదయ సిద్దాంతం మీద లోతుగా అధ్యయనం చేస్తున్నామని దానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అజెండాపై కసరత్తు చేస్తున్నామన్నారు.
తన పోరాటం డాడీ (కేసీఆర్-బీఆర్ఎస్ పార్టీ), మోడీ (బిజేపి), జూనియర్ మోడీ (సిఎం రేవంత్ రెడ్డి-కాంగ్రెస్ పార్టీ) మీదేనని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మే మొదటి వారంలో పార్టీ ప్రకటిస్తామన్నారు.