నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జారీ

కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. నేటి నుంచే ఈ రాష్ట్రాలలో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని ప్రకటించారు. 

పోలింగ్ తేదీలు:  

అస్సాం, కేరళ పుదుచ్చేరి: ఏప్రిల్‌ 9న. 

తమిళనాడు: ఏప్రిల్‌ 23న.

పశ్చిమ బెంగాల్: (రెండు దశలలో పోలింగ్) ఏప్రిల్‌ 23, ఏప్రిల్‌ 29. 

ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మే 4న. 

తమిళనాడులో 234, పుదుచ్చేరి: 30, కేరళ: 140, అస్సాం: 126, పశ్చిమ బెంగాల్: 294 సీట్లున్నాయి. మొత్తం నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి 824 స్థానాలున్నాయి. మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లున్నారు.

వీరి కోసం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని, పోలింగ్ అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 25 లక్షల మంది ఎన్నికల డ్యూటీలో పాల్గొనబోతున్నారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ తెలిపారు.