సోమవారం ఉదయం 6 గంటల
నుండి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో, కుమురం భీమ్ ఆసిఫాబాద్
జిల్లాలలోని జైనూరు, సిర్పూర్ మండలలో విద్యుత్ సరఫరా ఉండదు. పొరుగునే ఉన్న ఛత్తీస్
ఘడ్ రాష్ట్రం నుంచి తెలంగాణాకి వేసిన హాయ్ టెన్షన విద్యుత్ లైన్లని కలపడానికి రేపు
ఈ రెండు జిల్లాలలో విద్యుత్ సఫరా నిలిపివేయబోతున్నారు. రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి
కేసీఆర్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం 1000 మెగావాట్స్
విద్యుత్ సరఫరాకి ఒప్పందం కుదుర్చుకొన్న సంగతి తెలిసిందే. దాని కోసమే విద్యుత్
లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణా
రాష్ట్రానికి ఆదనపు విద్యుత్ లభిస్తుంది.