
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు జారీ అయ్యింది. రాష్ట్రంలో ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల పాలక మండళ్ళను ఎన్నుకోవడానికి ఫిభ్రవరి 11న ఎన్నికలు జరుగబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణి కుముదిని ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించారు.
ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది...
జనవరి 28: నామినేషన్స్ స్వీకరణ ప్రారంభం
జనవరి 30: నామినేషన్స్ దాఖలుకి గడువు.
జనవరి 31: నామినేషన్స్ పరిశీలన
ఫిభ్రవరి 3: నామినేషన్స్ ఉపసంహరణ గడువు.
ఫిభ్రవరి 11: పోలింగ్.
ఫిభ్రవరి 12: అవసరమైన చోట్ల రీపోలింగ్.
ఫిభ్రవరి 13: ఓట్ల లెక్కింపు.
ఫిభ్రవరి 16: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక.
ఫిభ్రవరి 16: కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.