డబ్బు మూటలున్న లొకేషన్ ఇదే: ప్రవీణ్ కుమార్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకోవడంతో మూడు పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు  చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ సోషల్ మీడియాలో కొద్ది సేపటి క్రితమే ఓ పోస్ట్ పెట్టారు. 

దానిలో “తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రులు బరితెగించి విచ్చలవిడిగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ క్రింది లోకేషన్ నుండే డబ్బుల మూటలను ‘ప్రభుత్వ వాహనం’ అని స్టిక్కర్లున్న వాహనాల్లో, ఎమ్మెల్యేల కార్లలో, ఛైర్మన్ల కార్లలో జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో తరలిస్తున్నారని చుట్టుపక్కల ప్రజలందరు సమాచారం ఇస్తున్నారు. 

ఈ పరిసరాల్లోనే సీయం రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు ఏవీ రెడ్డి గారు కూడా నివసిస్తున్నారంట! దీన్ని వెంటనే వెరిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. 

కానీ అక్కడ ఒక్క పోలీసు, లేదా రెవెన్యూ అధికారి కూడా లేరు! ఈ ఎన్నికలో సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరగబోతుందని ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఈ రోజు ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీ నాయకుల ఇళ్లపై దాడి చేసిన పోలీసులకు ఇవి కనిపించడం లేదా???” అని ట్వీట్ చేస్తూ డబ్బు మూటలున్న లొకేషన్ కూడా షేర్ చేశారు.