సంబంధిత వార్తలు

బీసీ రిజర్వేషన్స్‌పై ఓ పక్క హైకోర్టులో ఇంకా విచారణ జరుగుతుండగానే, గురువారం ఉదయం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం వేణు వెంటనే అభ్యర్ధులు నామినేషన్స్ వేయడం ప్రారంభం అయిపొయింది.
మొత్తం 5 దశలలో జరుగబోయే ఈ ఎన్నికలలో మొదటి రెండు దశలో 292 జెడ్పీటీసీ, 2, 964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన మూడు దశలలో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ ఎన్నికల షెడ్యూల్:
నామినేషన్స్: నేటి నుంచి ఈ నెల 11వరకు
పరిశీలన: అక్టోబర్ 12 వరకు
ఉపసంహరణ: అక్టోబర్ 15 వరకు
ఎన్నికలు: అక్టోబర్ 23వ తేదీ
ఓట్ల లెక్కింపు: నవంబర్ 11వ తేదీ.