ఓజీ... దేవుడికి జలుబు జ్వరం!

ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానులు పవన్‌ కళ్యాణ్‌ని దేవుడిగానే భావిస్తున్నారు. వారి దేవుడు రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. 

అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాల కారణంగా వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఈ కారణంగానే డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌కి జలుబు, జ్వరం మొదలయ్యాయి. మందులు వాడుతూ రెండు మూడు రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

కనుక ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నేడు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. త్వరగా కోల్కొని మళ్ళీ డ్యూటీ ఎక్కాలని సరదాగా అన్నారు.