సంబంధిత వార్తలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం మళ్ళీ యశోద హాస్పిటల్లో చేరారు. ఈ నెల 3వ తేదీన కేసీఆర్ యశోద హాస్పిటల్లో చేరగా ఆయనకు అన్నీ వైద్య పరీక్షలు చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని, సోడియం తక్కువగా ఉందని గుర్తించి తగిన చికిత్స చేసి రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. మళ్ళీ నాలుగు రోజులలోనే కేసీఆర్ హాస్పిటల్లో చేరడంతో కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు మళ్ళీ ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా ప్రకటన వెలువడవలసి ఉంది.