
తెలంగాణలో వైద్య విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం స్టైఫండ్ పెంచింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో ఇక నుంచి ఇంటర్న్ లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు మొదటి సంవత్సరంలో నెలకు రూ.67,032, రెండో సంవత్సరంలో రూ. 70,757, మూడవ సంవత్సరంలో నెలకు రూ.74,782 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తుంది.
సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్ధులకు మొదటి సంవత్సరంలో నెలకు రూ.1,06,461, ఆ తర్వాత సంవత్సరాలలో వరుసగా నెలకు రూ.1,11,785, రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తుంది.
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేత్తనాన్ని కూడా రూ.92,575 నుంచి రూ.1,06,461 కి పెంచింది. డెంటల్ స్టూడెంట్స్ స్టైఫండ్స్ కూడా 15 శాతం పెంచింది.