సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని ..
• సంగారెడ్డిలో కొత్తగా ఇంద్రేశం, జిన్నారం రెండు మున్సిపాలిటీలు ఏర్పాటుకి ఆమోదం. ఈస్నాపూర్ మున్సిపాలిటీని అప్‌గ్రేడ్ చేసి, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలలో కమీషనర్లతో సహా వివిద విభాగాలలో 316 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు.
• శాతవాహన యూనివర్సిటీలో కొత్తగా లా కాలేజీ ఏర్పాటుకి ఆమోదం.
• శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో 240 సీట్లతో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు. దానిలో ఏఐతో సహా ఈసీఈ, కంప్యూటర్ సైన్సస్ తదితర కోర్సులు ఉంటాయి.
• మహబూబ్ నగర్‌లో ట్రిపుల్ ఐటి ఏర్పాటుకి ఆమోదం.
• నవంబర్ 9 లోగా రాష్ట్రంలో అన్ని కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు.
• హైదరాబాద్ ఓఆర్ఆర్ (దక్షిణం) చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు (201 కిమీ పొడవు) ఎలైన్‌మెంట్‌కు ఆమోదం.
• ప్రముఖ క్యాన్సర్ వైద్య నిరపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియామకం.