క్వారీ యాజమానిని బెదిరించినందుకు వరంగల్ సుబేదారీ పోలీసులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి వరంగల్ తీసుకు వచ్చారు. ఈ విషయం తెలియడంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులకు, సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కానీ పోలీసులు సంయమనం పాటిస్తూ ఆయనని బారీ బందోబస్తు మద్య వైద్య పరీక్షల కొరకు ఎంజీఎం హాస్పిటల్‌కు తీసుకువెళుతుండగా బిఆర్ఎస్ పార్టీ నేతలు వారిని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. కానీ పోలీసులు వారిని చెదరగొట్టి కౌశిక్ రెడ్డిని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయించారు. మరికొద్ది సేపట్లో జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
కౌశిక్ రెడ్డి అరెస్టుని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. “సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తమ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు, అక్రమ కేసులతో ముఖ్య నేతలని అరెస్టు చేసి మా పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ ఈ కేసులు, అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం మా మానవధైర్యం దెబ్బతీయలేదు. ఈ పనికిరాని కేసులు కోర్టులలో నిలబడవు కూడా. మాపై ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాము. ఇచ్చిన ప్రతీ హామీ అమలుచేసేవరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము,” అని కేసీఆర్ అన్నారు.