బనకచర్లని అనుమతించవద్దు: సిఎం అభ్యర్ధన

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఇద్దరూ నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. 

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “బనకచర్లపై మా అభ్యంతరాలను కేంద్ర మంత్రికి తెలియజేశాము. ఆంధ్రప్రదేశ్‌ తలపెడుతున్న బనకచర్ల ప్రాజెక్టుని అనుమతించవద్దని, దాని వలన తెలంగాణ రైతాంగానికి చాలా నష్టం కలుగుతుందని చెప్పారు. 

ఏ నిర్ణయమైన తీసుకునేముంది మా వాదనలు పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఏపీ, తెలంగాణ సిఎంల సమావేశం ఏర్పాటు చేస్తామని, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యని సామరశ్యంగా పరిష్కరించుకుందామని సీఆర్ పాటిల్‌ చెప్పారు. 

ఇచ్ఛంపల్లి-నాగార్జున సాగర్ అనుసంధానం చేస్తే ఆ లింకు నుంచి పెన్నా బేసిన్‌కు నీళ్ళు తరలించవచ్చని చెప్పాము.

ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు కూడా అంతే వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కోరాము. మూసీ ప్రక్షాళనకి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాము,” అని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి చెప్పారు.