రేపు ఎల్బీ స్టేడియంలో యోగాసనాలు

ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగానే అంటే రేపు శుక్రవారం హైదరాబాద్‌, ఎల్బీ స్టేడియంలో ఉదయం 6 గంటల నుంచి యోగాసనాల కార్యక్రమం జరుగనుంది. దీనికి ముఖ్య అతిధులుగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హాజరుకాబోతున్నారు. 

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేయబోతున్నారు. కనుక ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.