కాళేశ్వరం కేసులకి కాళేశ్వరంతోనే చెక్?

ముల్లుని ముల్లుతోనే తీయాలనట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ చేత కేసీఆర్‌, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించడంతో, బిఆర్ఎస్ పార్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతోనే యుద్ధానికి సై అంటోంది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌పై వ్యక్తిగత కక్ష, ద్వేషంతో కాళేశ్వరంతో సహా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా వదిలేశారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. కనుక కేసీఆర్‌ నేతృత్వంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు ఎక్స్‌ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.