నేడు హైదరాబాద్, హైటెక్స్‌లో గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవం జరుగబోతోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. మరికొద్ది సేపటిలో ఈ కార్యక్రమం మొదలవబోతోంది. ప్రజా గాయకుడు గద్దర్ గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్ళ మరో నిర్ణయం తీసుకుంది.
గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గద్దర్ ఫౌండేషన్‌కు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నేడు గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు విడుదల చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజాన్ జీవో విడుదల చేశారు. ఇక నుంచి గద్దర్ జయంతి వేడుకలలో గద్దర్ ఫౌండేషన్ కూడా భాగస్వామిగా ఉంటుందని తెలియజేస్తూ మరో జీవో కూడా జారీ చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గద్దర్ ఆయనని కలిసేందుకు ప్రగతి భవన్‌కు వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా గేటు వద్దే ఆపేశారు. ఆయన అక్కడే సుమారు రెండు గంటలు కూర్చున్నా కేసీఆర్ లోనికి ఆహ్వానించలేదు. దాంతో ఆయన నిరాశగా వెనుతిరిగిపోయారు.
నాడు కేసీఆర్ చేతిలో అంత అవమానం ఎదుర్కొన్న గద్దర్‌కి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా గౌరవం కల్పిస్తుండటం చాలా అభినందనీయం.