
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఎన్నికలలో ఓటమి తర్వాత తన ఫామ్‌హౌస్‌లో జారిపడినప్పుడు తుంటి ఎముక విరగడం, దానికి శస్త్ర చికిత్స చేసుకోవడం అందరికీ తెలుసు. ఈరోజు జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట హాజరయ్యేందుకు ఆయన వెంట బయలదేరేందుకు ఫామ్‌హౌస్‌కి వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు.
ఈసారి ఆయన తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. వెంటనే బిఆర్ఎస్ నేతలు ఆయనని హైదరాబాద్, యశోధా హాస్పిటల్‌కు తరలించారు.
కేసీఆర్ ఈరోజు ఉదయం 11.30 గంటలకు బీఆర్కే భవన్ చేరుకొని జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు 9 మంది బిఆర్ఎస్ పార్టీ నేతలను లోనికి అనుమతించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లను కూడా కమీషన్ ప్రశ్నించి వివరాలు సేకరించింది. కనుక నేడు కేసీఆర్‌ని ప్రశ్నించడంతో విచారణ ముగించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తుందా? లేదా మళ్ళీ వారు ముగ్గురినీ మరోసారి విచారణకు పిలిపిస్తుందా? అనేది త్వరలో తెలుస్తుంది.