26.jpg)
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ నేడు ఉదయం 11.30 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచరణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట హాజరు కానున్నారు. ఇదే కేసులో మాజీ ఆర్ధిక మంత్రి, ప్రస్తుత బీజేపి ఎంపీ ఈటల రాజేందర్ జూన్ 6న, మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు 9న విచారణకు హాజరయ్యి తమ వాదనలు వినిపించారు.
కమీషన్ విచారణకు హాజరైన తర్వాత హరీష్ రావు నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్ళి తనని ఏయే అంశాల గురించి ప్రశ్నించారో వివరించారు. ఇద్దరూ సుదీర్గంగా చర్చించుకున్న తర్వాత కేసీఆర్ నేడు విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు కమీషన్ అంగీకరిస్తే హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులను విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
నేడు కేసీఆర్ కమీషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నందున భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు విచారణ జరుగుతున్న బూర్గుల రామకృష్ణ రావు భవన్ వద్దకు వచ్చే అవకాశం ఉంది. కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.