వారికే మంత్రి పదవులు.. సీనియర్లకు నిరాశే!

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత నేడు ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముందే చెప్పుకున్నట్లుగా గడ్డం వివేక్ (ఎస్సీ), అడ్లూరి లక్ష్మన్ కుమార్‌ (ఎస్టీ),  వి శ్రీహరి ముదిరాజ్ (బీసీ) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారి చేత ప్రమాణస్వీకారాలు చేయించారు. వారు ముగ్గురికీ ఇంకా శాఖలు కేటాయించలేదు. బహుశః ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది.  

ఈ మంత్రి పదవులు ఆశిస్తూ ఇంతకాలం చాలా అసహనంగా ఎదురుచూసిన మునుగోడు ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు, నిజామాబాద్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి,  మల్ రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వంటి పలువురు సీనియర్ నేతలు మంత్రి పదవులు ఇవ్వకపోతే రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని ముందే హెచ్చరించారు. వారిప్పుడు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.