ఇంకా విషమంగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం

జూబ్లీహిల్స్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.

కానీ అప్పటి నుంచి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. వైద్యులు ఆయనని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

పార్టీలకు అతీతంగా ఆయన అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు కనుక కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు తదితరులు హాస్పిటల్‌కి వచ్చి ఆయన పరిస్థితి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతున్నారు. కేటీఆర్‌ సతీమణి శైలిమ హాస్పిటల్‌లో  ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా ఉన్నారు.