మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్‌కౌంటర్

కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దేశంలో మావోయిస్టులను ఏరివేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భద్రతా దళాలు నేడు ఛత్తీస్‌ఘడ్‌-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో బీజాపూర్ సమీపంలో గల అటవీ ప్రాంతంలో ప్రవేశించి మావోయిస్టుల కోసం గాలిస్తున్నప్పుడు, వారి అగ్రనేత నరసింహ అలియాస్ సుధాకర్ బృందంని చుట్టుముట్టారు.

ఎదురు కాల్పులలో సుధాకర్‌తో సహా పలువురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లో మరణించారు. ఇప్పుడు మావోయిస్ట్ కేంద్ర కమిటీలో సభ్యుడుగా ఉన్న సుధాకర్ ఎన్‌కౌంటర్లో మృతి చెందడం వారికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.

2026, మార్చినాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా ఏరిపారేస్తామని, కనుక ప్రాణాలు కాపాడుకోవాలనుకునే వారు వెంటనే పోలీసులకు ఆయుధాలు సమర్పించి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. దీనిపై సర్వత్రా నిరసనలు, విమర్శలు వినిపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది.