ఘోషామహాల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కి మంగళహాట్ పోలీసులు మళ్ళీ హెచ్చరిక నోటీసు జారీ చేశారు. ఆయన ప్రాణాలకు చాలా ప్రమాదం ఉంది కనుక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే వెళ్ళాలని, తప్పనిసరిగా భద్రతా సిబ్బందిని వెంట ఉంచుకోవాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఈ నెల 7వ తేదీన ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకోబోతున్నారు. ఆ పండుగ సందర్భంగా వందలాది ఆవులు, ఎద్దులు, దూడలను కోసేందుకు సిద్దామవుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. నగరంలో ఎక్కడ ఒక్క ఆవుని, దూడని కోయాలని ప్రయత్నించినా ఊరుకునే ప్రసక్తే లేదని రాజాసింగ్ హెచ్చరించారు.
కనుక ముస్లింల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ నేపధ్యంలో రాజాసింగ్ భద్రత లేకుండా బయట తిరగితే ఆయనపై దాడులు జరిగే ప్రమాదం ఉందని, కనుక తాము సూచించిన విదంగా భద్రత పాటించాలని మంగళహాట్ పోలీసులు రాజాసింగ్‌ని హెచ్చరిస్తూ సోమవారం నోటీసు జారీ చేశారు.
గతంలో కూడా ఆయనకు ఇటువంటి నోటీసులతో హెచ్చరించారు. కానీ తాను ఉండే ఘోషా మహల్ ప్రాంతం అంతా ఇరుకు సందులతో ఉంటుందని, వాటిలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం వేసుకొని తిరగలేనని రాజాసింగ్ తేల్చి చెప్పారు. బహుశః ఇప్పుడూ అదే చెపుతారేమో?