ప్రధాని మోడీ గురువారం వర్చువల్ పద్దతిలో దేశవ్యాప్తంగా ఒకేసారి 103 రైల్వే స్టేషన్లకి ప్రారంభోత్సవం చేయనున్నారు. అమృత్ పధకం కింద వీటిని రైల్వేశాఖ ఆధునీకరించింది. రేపు ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోడీ వర్చువల్ పద్దతిలో ఒకేసారి 103 రైల్వే స్టేషన్లకి ప్రారంభోత్సవం చేస్తే, ఆయా రాష్ట్రాలలో బీజేపి ఎంపీలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా రైల్వే స్టేషన్లలో ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్రంలో బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోడీ రేపు ప్రారంభించబోతున్నారు. వీటి కోసం రైల్వే శాఖ రూ.77.80 కోట్ల వ్యయంతో ఆధునీకరించారు. వీటిలో బేగంపేట రైల్వేస్టేషన్‌ని పూర్తిగా మహిళలే నిర్వహించబోతున్నారు.
16. ఇది సూపర్!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 20, 2025
Telangana 🚉 Amrit Stations: Begumpet (all-women-operated railway station), Karimnagar, Warangal pic.twitter.com/MhsDbpJWkl