ఢిల్లీ లక్ష్యంగా ఫతే-2 క్షిపణి ప్రయోగించిన పాక్‌?

పాకిస్థాన్‌ ఈరోజు తెల్లవారుజామున 3.50 గంటలకు ఢిల్లీ లక్ష్యంగా చేసుకొని ఫతే-2 120కిమీ దూరంలో లక్ష్యాలను ఛేదించగల దీర్గ శ్రేణి క్షిపణిని ప్రయోగించింది.

కానీ భారత్‌ ఆర్మీ దానిని బరాక్-8 క్షిపణి నిరోధక వ్యవస్థతో హర్యానాలోని సిర్సా సమీపంలో కూల్చేసింది.

పాక్‌ ఆర్మీ శుక్రవారం రాత్రి జమ్ము కశ్మీర్‌లో బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. కానీ భారత్‌ గగనతల రక్షణ వ్యవస్థ వాటన్నిటినీ గాల్లోనే పేల్చేసింది. శ్రీనగర్, అవంతిపురాలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఈ దాడులకు పాల్పడింది.

పాక్‌ దాడులను సమర్ధంగా తిప్పికొడుతూనే మరోపక్క పాకిస్థాన్‌ ఆర్మీకి ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ మూడు వైమానిక స్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు చేసింది. భారత్‌ వాయుసేన రావల్పిండిలోని చక్లాల, నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురీద్, జాంగ్ జిల్లా, షోర్కోట్‌లో రఫీకి వైమానిక స్థావరాలపై క్షిపణులతో వరుస దాడులు చేసింది.

పాక్‌ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి వీటిని ధృవీకరిస్తూ, దీనికి భారత్‌ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.