బుధవారం తెల్లవారుజామున భారత్ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేశాయి. ఈ నేపధ్యంలో పాకిస్థాన్ కూడా ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉంది కనుక ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పాకిస్థాన్‌కు అత్యంత సమీపంలో ఉన్న అమృత్సర్, జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను మూసివేశారు. ప్రయాణికులు, విమానాల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ విమానాశ్రయాలకు విమానాల రాకపోకలు జరగవని తెలిపింది. పాక్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉన్నందున భారత్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు యుద్ధ సన్నద్ధతో ఉన్నాయి.