సమైక్య రాష్ట్రంలో నమోదైన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుపై రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ళ తర్వాత తీర్పు వెలువడటం విశేషం. అనంతపురం జిల్లా, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నేడు హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి (ఏ2), బీవీ శ్రీనివాసరెడ్డి (ఏ1), వీడీ రాజగోపాల్ (ఏ3, గనుల శాఖ మాజీ డైరెక్టర్), కె.మెఫజ్ అలీఖాన్ (ఏ7, గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు) దోషులుగా సీబీఐ కోర్టు నిర్ధారించింది.
ఇదే కేసులో దోషిగా పేర్కొనబడి చంచల్‌గూడా జైలుకి వెళ్ళి వచ్చిన మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలు నిర్ధోషులుగా ప్రకటించింది. కనుక సబితా ఇంద్రా రెడ్డికి ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించింది. ఇదే కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి 2022లోనే హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.