పహల్గాం ఉగ్ర దాడితో భారత్-పాక్ మద్య మొదలైన ఉద్రిక్తతలు పాకిస్థాన్ దళాలు సరిహద్దులలో కాల్పులు మొదలుపెట్టడంతో నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్ నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పాకిస్థాన్ విమానాలు భారత్ మీదుగా ప్రయాణించకుండా ఇప్పటికే గగనతలం మోసేసిన భారత్, ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యగా సముద్ర మార్గాన్ని కూడా మూసివేసింది. ఇక నుంచి భారత్ సముద్ర జలాలలోకి పాకిస్థాన్‌కు చెందిన సరుకు రవాణా నౌకలు కూడా ప్రవేశించకుండా నౌకాదళం అడ్డుకుంటుంది. భారత్ సరుకు రవాణా నౌకలు కూడా పాకిస్థాన్ నౌకాశ్రయాలకు వెళ్ళరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత్‌తో పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతున్నప్పటికీ భారత్ తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలతో ఆ దేశంలో వివిద రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరోపక్క పాకిస్థాన్ కూడా భారత్‌పై అవే ఆంక్షలు విధిస్తూ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది.