సిఎం స్పందనకు థాంక్స్ కానీ...

టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 7 నుంచి సమ్మెకు సిద్దమవుతున్నారు. సమ్మెపై సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించినందుకు ధామస్ రెడ్డి, హనుమంతు ముదిరాజ్, ఈదురు వెంకన్న తదితర జీఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. 

1. టిజిఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘాలను ఉండాలని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా అన్నారు. కానీ ఇప్పుడు వాటి పునరుద్దరించాలని తాము కోరుతున్నా పట్టించుకోవడంలేదు. ఎందుకు? 

2. టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కోరుతున్న డిమాండ్లలో 90 శాతం ఆర్ధిక అంశాలతో సంబంధం లేనివే. కానీ వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదు? 

3. ఏడెనిమిది నెలలుగా టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు టిజిఎస్ ఆర్టీసీ యాజమాన్యంతో, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. వాటిని పట్టించుకోకపోవడం వల్లనే సమ్మె నోటీస్ ఈయవలసి వచ్చింది. 

టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయాలు ప్రస్తావిస్తూ, సిఎం రేవంత్ రెడ్డి తమకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే నేరుగా కలిసి ఆయనకే అన్నీ వివరిస్తామని చెప్పారు. తాము కూడా సమ్మె చేయాలని కోరుకోవడం లేడని కానీ టిజిఎస్ ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం నుంచి స్పందన రానందునే తాము ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెప్పారు.