బదిలీపై స్మితా సభర్వాల్ ఏమన్నారంటే..

పర్యాటక శాఖ కార్యదర్శిగా చేస్తున్న స్మితా సభర్వాల్‌పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తనని ఫైనాన్స్ కమీషన్ మెంబర్ సెక్రెటరీగా బదిలీ చేయడంపై స్పందిస్తూ భగవద్గీతలోని ‘కరమన్యేవాదికారాస్తే మా ఫలేశు కదాచన,” (ఫలితం ఆశించకుండా కర్మలు ఆచరించు) అనే కొటేషన్ పెట్టి దాని కింద, తాను 4 నెలలు మాత్రమే పర్యాటక శాఖలో పనిచేసినా ఆ కొద్దిపాటి సమయంలోనే అనేక మార్పులు చేర్పులు, అభివృద్ధి పనులు చేయగలిగానని, తన శక్తిమేర కష్టపడి పనిచేశానని దానిలో పేర్కొన్నారు. 

1. పర్యాటక శాఖలో చిరకాలంగా అమలుకు నోచుకోని 25-30 పర్యాటక విధానాన్ని దేశంలో మొట్ట మొదట అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణని నిలిపాను. దీని వలన నిర్లక్ష్యానికి గురవుతున్న పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు నిర్ధిష్టమైన విచానం రూపొందించాను. 

2. పర్యాటక శాఖలో ఉద్యోగుల పనితీరుని మెరుగుపరిచి అందరూ బాధ్యతాయుతంగా పనిచేసేలా చేశాను. 

3. హైదరాబాద్‌లో జరుగబోయే ప్రపంచ అందాల పోటీల నేపధ్యంలో పర్యాటక శాఖలో రవాణా మరియు ప్లానింగ్ కొరకు ప్రణాళికలు సిద్దం చేశాను. 

4. పర్యాటక శాఖలో పనిచేయడం చాలా సంతోషం కలిగింది. ఈ శాఖలో పనిచేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. అంటూ దణ్ణం పెడుతున్న ఇమోజీతో ట్రావెల్ తెలంగాణ అని స్మితా సభర్వాల్‌ ముగించారు.