
వక్ఫ్ బిల్లుకి రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. దీనిపై రాజ్యసభలో గురువారం అర్దరాత్రి వరకు సుదీర్గంగా అధికార, ప్రతిపక్షాలు మద్య చర్చలు, వాదోపవాదాలు జరిగిన తర్వాత బిల్లులో సవరణలవారీగా ఓటింగ్ నిర్వహించగ అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓట్లు వేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు-2025కి పార్లమెంట్ ఆమోదం లభించిన్నట్లయింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయడం లాంఛనప్రాయమే కనుక త్వరలోనే ఇది చట్టరూపం దాల్చుతుంది.
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం మద్యాహ్నం ఈ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టి జరిగిన చర్చలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు సభ దృష్టికి తీసుకువచ్చారు.
1. ఇస్లాం మతంలో సున్నీ, షియాలు మాత్రమే కాకుండా మరికొన్ని వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, ఇంతవరకు వారికి వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం లభించలేదని, ఈ బిల్లుతో వారికి అవకాశం కల్పిస్తున్నాము.
2. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వారికి జరుగుతున్న అన్యాయాలను సరిచేయకుండా విడిచిపెట్టేసింది. కానీ మా ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టింది. అదేవిదంగా ఈ సవరణాలతో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలనుకుంటోంది తప్ప ముస్లింల మత విషయాలలో జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు.
3. వక్ఫ్ బోర్డుకి 21913-2013 మద్య కాలంలో 18 లక్షల హెక్టార్ల భూములు ఉండగా, 2013-2025 నాటికి అవి 21 లక్షల హెక్టార్లకు పెరిగింది. వాటిలో చాలా వరకు ఆక్రమణలకు గురవుతున్నాయి. దుర్వినియోగం అవుతున్నాయి. కనుకనే వాటిని కాపాడేందుకు మా ప్రభుత్వం ఈ చట్ట సవరణలు చేస్తోంది.
4. మొత్తం 22 మంది సభ్యులతో ఉండే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు కొద్ది మందే ఉంటారు. వారిలో ప్రభుత్వాధికారులు, జిల్లా స్థాయి న్యాయమూర్తులు మాత్రమే ఉంటారు.