తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు రిజర్వేషన్స్ పెంపు కోసం ధర్నా చేస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచాలని కోరుతూ మా ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు.
"హైదరాబాద్ గల్లీలో చెపితే ప్రధాని మోడీకి వినపడటం లేదనే నేను ఢిల్లీ వచ్చి ఇక్కడ నుంచి అడుగుతున్నాను. ఇకనైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే దేశంలో కలిసివచ్చే అన్ని పార్టీలను కలుపుకొని దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా చేపడతాను. గోటితో పోయేది గొడ్డలి వరకు తెచ్చుకోవద్దని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా,” అని అన్నారు.
కానీ గతంలో కేసీఆర్ ఈ రిజర్వేషన్స్ కోసం శాసనసభలో తీర్మానం చేసి పంపితేనే పట్టించుకోని మోడీ సర్కార్, రేవంత్ రెడ్డి దమ్కీలకు భయపడుతుందా?

మా తెలంగాణలో మా నాలుగు కోట్ల ప్రజల్లో మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం మేము, మాకు అనుమతి ఇవ్వండని మేం తీర్మానం చేస్తే మీకొచ్చిన కష్టం ఏంటి మోడీ గారు..??

గల్లీలో చెప్తే మీకు వినబడలేదు..!

అందుకే ఢిల్లీ వచ్చాం..!

- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి pic.twitter.com/3d0BdBH1CE
— Telugu360 (@Telugu360) April 2, 2025