
సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ ఎం. రమేష్ నేతృత్వంలో పనిచేసే ఈ సిట్ బృందంలో నిఘా విభాగం ఎస్పీ సింధూ శర్మ, సీఐడీ ఆర్ధిక నేరాల ఎస్పీ కే. వెంకటలక్ష్మి, డీఎస్పీ ఎం.శంకర్, సైబరాబాద్ అదనపు ఎస్పీ ఎస్.చంద్రకాంత్ సభ్యులుగా ఉంటారు.
ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన అన్ని బెట్టింగ్ యాప్ కేసులు సిట్‌కి బదిలీ చేయబడతాయి. ఈ బృందం బెట్టింగ్ యాప్‌లకు సంబందించిన ప్రతీ అంశంపై లోతుగా విచారణ 90 రోజులలో ప్రభుత్వాణికి నివేదిక సమర్పిస్తుంది.
ఇందుకోసం న్యాయ నిపుణులు, ఆర్ధిక నిపుణులు, ఫోరెన్‌సిక్ తదితర నిపుణులు లేదా సంస్థల సలహాలు, సహాయ సహకారాలు తీసుకుంటుంది. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆదాయపన్ను, జీఎస్టీలకు సంబందించిన నిపుణుల సలహాలు కూడా తీసుకుంటుంది. సిట్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ కట్టడికి తగిన విది విధానాలు, చట్టాలు రూపొందించి అమలుచేస్తుంది.