
ఏప్రిల్ 23 వ తేదీన జీహెచ్ఎంసీ లోకల్ ఆధారిటీస్ (ప్రజాప్రతినిధుల) కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగబోతోంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరే కార్పొరేటర్లు ఉన్నందున ఈ ఎన్నికకు పోటీ చేయడం లేదని, మజ్లీస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసింది.
జీహెచ్ఎంసీలో బిఆర్ఎస్ పార్టీకి 41 మంది ఉన్నారు. కానీ తాము కూడా పోటీ చేయడం లేదని, మజ్లీస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది.
జీహెచ్ఎంసీలో బీజేపికి 25 మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలంటే కనీసం 60 మంది అవసరం. ఒకవేళ బిఆర్ఎస్, బీజేపిలు పరస్పరం సహకరించుకుంటే ఏదో ఓ పార్టీ పోటీ చేసి ఈ సీటు గెలుచుకోవచ్చు. కానీ అలా చేస్తే ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. కనుక తగినంత మంది కార్పొరేటర్లు లేని కారణంగా ఈ ఎన్నికకు బీజేపి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండటం, వాటిలో రెండు పార్టీలు మద్దతు ప్రకటించడంతో మజ్లీస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మీర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనప్రాయమే.