దేవన్నపేటలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ

బిఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 ఏళ్ళు పూర్తి చేసుకొని ఏప్రిల్ 27న 25 వ సంవత్సరంలో అడుగుపెట్టబోతోంది. వరంగల్‌ జిల్లా వర్ధనపేటలో ఈ రాజతోత్సవ సభ నిర్వహించేందుకు బిఆర్ఎస్ పార్టీ నేతలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మాజీ మంత్రి, పార్టీలో సీనియర్ నాయకుడు హరీష్ రావు ఈ సభ నిర్వహణ కమిటీలన్నిటినీ పర్యవేక్షిస్తున్నారు. కనుక శనివారం ఆయన పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి దేవన్నపేటలో సభ నిర్వహించబోయే ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి ఏర్పాట్ల గురించి చర్చించారు.

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుస ఓటముల కారణంగా ఢీలా పడిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం నింపేందుకు ఈ రజతోత్సవ సభ చాలా ఉపకరిస్తుంది. కనుక కేసీఆర్‌ సూచన మేరకు చాలా అట్టహాసంగా సుమారు లక్షమందితో ఈ సభ నిర్వహించేందుకు బిఆర్ఎస్ నేతలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో కేసీఆర్‌ పాల్గొనివ పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.