అబద్దాలపై జీఎస్టీ వేస్తేగానీ బిఆర్ఎస్ ఆగదు!

ఈరోజు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే చర్చలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని తెలివిగా ఉపయోగించుకుంటూ అబద్దాలు ప్రచారం చేస్తోంది. ఓ అబద్దాన్ని పదేపదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే చివరికి అదే నిజమని ప్రజలు నమ్ముతారని బిఆర్ఎస్ పార్టీ ఆశ పడుతున్నట్లుంది.

సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగించుకోవాలి కానీ  ఎవరినో దెబ్బ తీసేందుకు కాదు. సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంతో నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. ఓ మహిళా మంత్రినైన నన్ను బాడీ షేమింగ్ చేసి నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం సబబా?” అని ప్రశ్నించారు. 

బీఎసీ కమిటీలో శాసనసభలో ఏ రోజు ఏ అంశంపై చర్చించాలో ముందుగానే నిర్ణయిస్తారు. ఈనెల 17న కుల గణన, 18న మాల మాదిగ ఉపకులాల మీద చర్చించాలని నిర్ణయిస్తే, మాకు తెలియదని ఈ బిఆర్ఎస్ నేతలు చెపుతున్నారు.

వీళ్ళు అబద్దాలు చెప్పకుండా నీయంత్రించాలంటే అబద్దాలపై కూడా జీఎస్టీ విధించాలని ఈసారి ప్రధాని మోడీగారిని కలిసినప్పుడు విజ్ఞప్తి చేస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.