జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. జనాభా నియంత్రణ పాటిస్తూ, తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు దీని వలన తీవ్రంగా నష్టపోతాయని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దీని గురించి చర్చించేందుకు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో పార్టీలతో ఈ నెల 22న చెన్నైలో సమావేశం నిర్వహించబోతున్నారు.
స్టాలిన్ తన పార్టీలో సీనియర్ నేతలను సిఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించి ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూనే కాంగ్రెస్ అధిష్టానం అనుమతిస్తే తప్పకుండా వస్తానని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ కూడా బీజేపిని, మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొనే మాటైతే కేసీఆర్ హాజరు కాకపోవచ్చు.
డీలిమిటేషన్ పై మార్చి 22న చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది
తమిళనాడు సీఎం స్టాలిన్ చేపట్టబోయే కార్యాచరణకు మద్దతు ఇస్తాం
పార్టీ అధిష్టాన అనుమతి తీసుకుని ఆల్ పార్టీ మీటింగ్ కు అటెండ్ అవుతా.
- సీఎం రేవంత్ రెడ్డి@revanth_anumula @mkstalin #Delimitation #RTV pic.twitter.com/EOyi4I2KUn