రంగారెడ్డి జిల్లాలో 765.28 చదరపు కిమీ విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సిడిఏ) ఏర్పాటు చేస్తూ బుధవారం జీవో జారీ చేసింది.
సిఎం రేవంత్ రెడ్డి ఛైర్మన్గా ఉండే ఈ ఎఫ్సిడిఏలో మున్సిపల్, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య శాఖ మంత్రి వైస్ ఛైర్మన్గా ఉంటారు. దీనిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ధికశాఖ, మున్సిపల్, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమలు, ఐటి శాఖ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమీషనర్, తెలంగాణ ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైదరాబాద్ డీటీసీపీ సభ్యులుగా ఉంటారు.
అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాలు, శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారికి నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారికి మద్యన ఉండే ఏడు మండలాలో 56 గ్రామాలను ఈ ఎఫ్సిడిఏ పరిధిలోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.