యూపిలో ఘోర రైలు ప్రమాదం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున 3.00 గంటలకి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్పూర్ కి సుమారు 100 కిమీ దూరంలో కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుక్రయాన్ అనే ప్రాంతంలో పాట్న-ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 96 మంది చనిపోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరుగడంతో ఏమి జరిగిందో తెలియకుండానే 63మంది మరణించారు. చికిత్స పొందుతూ 36 మంది మరణించారు. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. 

ఈ విషయం తెలిసిన రైల్వే అధికారులు వెంటనే అక్కడికి సహాయ, వైద్య బృందాలని పంపించి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కాన్పూర్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఒక ప్రత్యేక రైలుని పంపించి మిగిలిన ప్రయాణికులని కాన్పూర్ కి తరలించి అక్కడి నుంచి వారి గమ్య స్థానాలకి పంపిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులని సమీప ఆసుపత్రులకి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఇప్పటికే బారీ క్రేన్స్ పంపించారు. వాటి సహాయంతో దెబ్బ తిన్న బోగీలని పక్కకి తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్ళవలసిన రైళ్ళలో కొన్నిన్నటిని రద్దు చేయగా మరికొన్నిటిని వేరే మార్గాలకి మళ్ళిస్తున్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్వయంగా డిల్లీ నుంచి సహాయచర్యలని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్ర పోలీస్ డిజిపిని సంఘటనా స్థలానికి పంపించి అవసరమైన సహాయ చర్యలు చేపట్టారు. 

ఈ ప్రమాదంలో భాదితుల వివరాలు తెలుసుకొనేందుకు రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అవి: ఇండోర్:0741-1072, ఉజ్జయిన్: 0734-2560906, రత్లాం: 07412-1072, ఒరాయ్: 05162-1072, ఝాన్సీ; 0510-1072, పోఖర్యా: 0511-3270239.

ఇవే కాకుండా రైల్వేశాఖకి చెందిన మరో ఆరు అదనపు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అవి; రైల్వే శాఖ: 025-83288, ఎం.జి.ఎస్.: 05412-251258, హెచ్.జె.పి.:06224-272230, పి.ఎన్.బి.ఈ.: 0612-2202290, 0612-2202291, 0612-2202292.