తెలంగాణలో రేపు జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్-నిజామాబాద్-అదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం ఎన్నికలు జరుగబోతున్నాయి.
రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 56 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
కనుక రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు 210, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 74 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ మూడు స్థానాలకు నమోదైన ఓట్లను మార్చి 3న లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.