నేడు మహాశివరాత్రి సందర్భంగా అంబర్ పేట ఫ్లై ఓవర్‌పై ప్రజల రాకపోకలను అనుమతించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా సుందరీకరణ పనులు పూర్తి కానందున ఇంకా అధికారికంగా ప్రారంభోత్సవం కాలేదు. కానీ ప్రజల సౌకర్యార్ధం నేటి నుంచి ఫ్లై ఓవర్‌పై రాకపోకలకు అనుమతించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆయన ఆదేశం మేరకు నేటి నుంచి ప్రజలను ఫ్లై ఓవర్‌పైకి అనుమతిస్తున్నారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కాక ముందే ప్రజలను రాకపోకలకు అనుమతించడం చాలా అరుదు. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కిషన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కానీ ఈ విషయం ముందుగా సిఎం రేవంత్ రెడ్డికి, సంబంధిత అధికారులకు తెలియజేశారో లేదో ఇంకా తెలియవలసి ఉంది. ఒకవేళ తెలియజేయకపోతే ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపిల మద్య రాజకీయ యుద్ధం ప్రారంభం అవుతుంది. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది.