కేంద్ర హోంశాఖ తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపిఎస్ ఉన్నతాధికారులకు షాక్ ఇచ్చింది. ముగ్గురినీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ డీజీపీగా చేసి ప్రస్తుతం రోడ్ సేఫ్టీ డీజీగా పనిచేస్తున్న అంజనీ కుమార్, పోలీస్ ట్రైనింగ్ డీజీగా చేస్తున్న అభిలాష్ బిస్తా, కరీంనగర్ సీపీగా చేస్తున్న అభిషేక్ మహంతి ముగ్గురూ తక్షణం తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకొని ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.
ఈ ముగ్గురు ఐపీస్ అధికారులు ఏపీ క్యాడర్‌కు చెందినవారు కనుక రాష్ట్ర విభజన సమయంలో వారిని ఏపీకి కేటాయించింది. కానీ వారు ట్రిబ్యునల్‌ని ఆశ్రయించి నేటికీ తెలంగాణలో కొనసాగుతున్నారు.
గత ఏడాదిలో కూడా ఇదేవిదంగా తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, ప్రశాంతిలను ఏపీకి తిప్పి పంపగా వారందరూ ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరు ముగ్గురూ కూడా ఏపీకి బయలుదేరక తప్పదు.