తెలంగాణ బీజేపిపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి ముందుగా 5 జిల్లాలకు పార్టీ అధ్యక్షులని నియమించింది. నారాయణపేట: కె. సత్య యాదవ్; నిర్మల్: రితేష్ రాథోడ్; సూర్యాపేట: శ్రీ లలితా రెడ్డి; సిద్ధిపేట: బైరి శంకర్ ముదిరాజ్; రాజన్న సిరిసిల్లా: ఆర్.గోపీ ముదిరాజ్‌లను నియమించింది. అలాగే ఈ 5 జిల్లాలకు కార్యవర్గ సభ్యులను కూడా నియమించింది.
2023 శాసనసభ ఎన్నికలకు ముందు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపి అధ్యక్షుడుగా నియమితులయ్యారు. త్వరలో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. కనుక ఈసారి ఎంపీ ఈటల రాజేందర్‌కి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని అందరూ భావిస్తున్నప్పటికీ, ఈసారి మహిళా అధ్యక్షురాలుని నియమించాలని బీజేపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో సీనియర్ నాయకురాలు, ఎంపీ డికే అరుణ పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపిలోకి వచ్చారు కనుక కాంగ్రెస్ నేతల బలాబలాలు ఆమెకు బాగా తెలుసు. కనుక ఆమె సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేతలను బలంగా ఎదుర్కొని నిలువరించగలరని బీజేపి అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆమెకు ఈ పదవి ఇస్తే దానిని ఆశిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్‌కు నిరాశ తప్పదు.