పాస్‌పోర్టు కార్యాలయానికి కేసీఆర్‌ దంపతులు

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ ఈరోజు తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి బయలుదేరారు. ముందుగా భార్య శోభతో కలిసి సికింద్రాబాద్‌, పోర్టు కార్యాలయానికి వెళ్ళారు. వారికి పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బంది సాధారంగా స్వాగతం పలికి లోనికి తీసుకువెళ్ళారు. అక్కడ వారిరువురి పాస్‌పోర్టులు రెన్యువల్ చేయించుకున్నారు. అక్కడి నుంచి కేసీఆర్‌ నేరుగా తెలంగాణ భవన్‌ బయలుదేరి వెళ్ళిపోగా, ఆయన సతీమణి శోభ వేరే కారులో ఇంటికి వెళ్ళిపోయారు. 

కేసీఆర్‌ దంపతులు అమెరికాలో చదువుకుంటున్న తమ మనుమడు (కేటీఆర్‌ కుమారుడు) హిమాన్షు వద్దకు వెళ్ళాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ వివిద కారణాల వలన ఆలస్యం అయ్యింది. ఇప్పుడు పాస్‌పోర్టు రెన్యువల్ చేయించుకున్నందున త్వరలో అమెరికా వెళ్ళబోతున్నారేమో?