తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ ప్రభుత్వం చేతికి వచ్చింది. దానిపై మంత్రివర్గ ఉపసంఘంలో నేడు చర్చించిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని వివరాలు మీడియాకు తెలియజేశారు.
రాష్ట్రంలో మొత్తం 96.9 శాతం మంది అంటే సుమారు 3.50 కోట్ల మంది ప్రజలు తమ వివరాలు అందించారు. మరో 3.1 శాతం ప్రజలు అంటే 16 లక్షల మంది తమ వివరాలు ఇవ్వలేదు.
ఈ సర్వేలో మొత్తం 1,03,889 మంది పాల్గొని ప్రజల నుంచి వివరాలు సేకరించి డేటా తయారుచేయగా వాటితో రూపొందించి నివేదికని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియామంత్రివర్గ ఉపసంఘానికి అందజేశారు.
దాని ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా: 46.25 శాతం ఉండగా ఎస్టీ జనాభా 10.45 శాతం, ముస్లిం మైనార్టీల జనాభా 10.08 శాతం, ముస్లిం మైనార్టీలలో ఓసీలు 2.48 శాతం జనాభా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా 15.79 శాతం ఉంది.
త్వరలోనే ఈ నివేదికని మంత్రివర్గం సమావేశంలో చర్చించి ఆమోదించిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నివేదికలో జనాభా శాతం ఆధారంగా ఆయా వర్గాల సంక్షేమం కోసం చక్కటి ప్రణాళికాలు రూపొందించి అమలుచేస్తామని చెప్పారు. ఇది తెలంగాణ సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తేబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.