ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ జారీ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చెరో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమీషన్ బుధవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ ప్రకటించి, నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 27న  పోలింగ్ నిర్వహిస్తుంది. మార్చి 3న ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తుంది. 

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ (పట్టభద్రుల నియోజకవర్గం), కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ (ఉపాధ్యాయ నియోజకవర్గం), నల్గొండ-వరంగల్-ఖమ్మం (ఉపాధ్యాయ నియోజకవర్గం) మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

బీజేపి ఇప్పటికే ఈ మూడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.  

కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ (పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి): సి.అంజిరెడ్డి

కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి): మల్క కొమురయ్య 

నల్గొండ-వరంగల్-ఖమ్మం (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి): పులి సరోత్తమ్ రెడ్డి.