మందకృష్ణకు పద్మశ్రీ.. బాలయ్యకు పద్మభూషణ్

నేడు గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్‌లో ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్, మాదిగల హక్కులకు పోరాడుతున్న ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. 

ప్రముఖ సినీ నటులు అజిత్ కుమార్‌, శోభన, కన్నడ నటుడు అనంత నాగ్ అశ్విన్‌, మరాఠీ సినీ దర్శకుడు శేఖర్ కపూర్‌ పద్మ భూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు. దివంగత గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ మారికొందరికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది.    

మొత్తం 139 పద్మ అవార్డులలో 133 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి ఇద్దరికీ, ఏపీ నుంచి ఐదుగురు, విదేశీయులు, ప్రవాస భారతీయులు 10 మంది, చనిపోయిన ప్రముఖులు 13 మంది ఉన్నారు.

మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ పద్మ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఈ అవార్డులు అందజేస్తారు.