హైదరాబాద్‌లో నిర్మించిన ఆరాంగఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయి చాలా కాలమే అయ్యింది. నగరంలో ఇంతవరకు నిర్మించిన అనేక ఫ్లై ఓవర్లలో ఫ్లై ఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ పొడవు 11.6 కిమీ కాగా ఇది 4.08 కిమీ పొడవుతో రెండో పొడవైన ఫ్లై ఓవర్‌గా నిలుస్తోంది. ఎస్ఆర్‌డీపీ పదకంలో భాగంగా దీనిని 800 కోట్లు వ్యయంతో ఆరు వరసలతో నిర్మించారు.
సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఫ్లై ఓవర్‌ని ప్రారంభోత్సవం చేస్తారు. వెంటనే ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తే ఆరాం ఘర్, శాస్త్రిపురం, కాలా పత్తర్, దారుల్ వులుం, శివవరాం పల్లి, హాసన్ నగర్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.
సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.