పెళ్ళిళ్ళ సీజనులో వరుసపెట్టి ఆహ్వాన పత్రికలు వచ్చిన్నట్లే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌కి వరుసపెట్టి ఆహ్వాన పత్రికలు వస్తున్నాయి.
ఫార్ములా 1 రేసింగ్ కేసులో సోమవారం ఉదయం తమ ముందు విచారణకు హాజరు కావాలని ఏసీబీ కేటీఆర్‌కి నోటీస్ పంపింది. అంతకు ముందే ఈడీ కూడా కేటీఆర్‌కి నోటీసు పంపి మంగళవారం విచారణకు హాజరు కావాలని కోరింది.
ఇదే కేసులో ఆయనతో పాటు హెచ్ఎండీఏ మాజీ కమీషనర్ అర్వింద్ కుమార్‌కి, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా రెండు దర్యాప్తు సంస్థలు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపాయి.
ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించి అరెస్ట్ చేయకుండా సోమవారం వరకు మద్యంతర బెయిల్ పొందారు.
ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కనుక ఒకవేళ హైకోర్టు ఆయన పిటిషన్ కొట్టివేస్తే వెంటనే ఏసీబీ లేదా ఈడీ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.