డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నేడు కడప రిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహార్ బాబని పరామర్శించేందుకు వచ్చినప్పుడు, భారీ సంఖ్యలో ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు.
జవహార్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి చేయడంతో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనని పరామర్శించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా అభిమానులు ‘ఓజీ.. ఓజీ..’ అంటూ ఆపకుండా నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
పవన్ కళ్యాణ్ వారిస్తున్నా నినాదాలు ఆపకపోవడంతో, “ఎంటయ్యా మీరు.. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదు..." అంటూ పవన్ కళ్యాణ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లులో మిగిలిన సన్నివేశాలను పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో, పాలనా వ్యవహారాలలో చాలా బిజీ అయిపోవడంతో సుజీత్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘ఓజీ’ ఇంకా ఎప్పుడు మొదలుపెడతారో ఎప్పుడు పూర్తి చేస్తారో తెలీదు.
కనుక ఓజీ సినిమా అప్‌డేట్ ఇమ్మనమని సూచిస్తూ అభిమానులు కేకలు వేశారు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన్నట్లు సమయం సందర్భం చూడకుండా నినాదాలు చేయడం ఎవరికైనా ఇబ్బందే. ఇటువంటి సందర్భంలో ఆయన తన సినిమా గురించి వారితో మాట్లాడితే, ఆయనే విమర్శలకు గురవుతారు కదా?
గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్ళిన పవన్.
అభిమానులు : ఓజీ... ఓజీ... ఓజీ...
పవన్ : మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా అయ్యా! #PawanKalyan pic.twitter.com/bJXFiOGtLa
(Video Courtecy: Gulte)