తెలంగాణ ప్రభుత్వానికి, అల్లు అర్జున్‌కి మద్య జరుగుతున్న వివాదంపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్ భిన్నంగా స్పందించారు. “సభా సమావేశం ముగిసిన తర్వాత మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో ఈ ప్రశ్న అడిగించి, సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో పెద్ద డ్రామా సృష్టించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా దీనిపై శాసనసభలో డ్రామా అవసరమా?
రాష్ట్రంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాలలో ఎందరో విద్యార్ధులు నిత్యం కలుషిత ఆహారం తిని అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. కనీసం వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేయలేదు. వారిలో కొందరు మరణిస్తున్నారు కూడా. మరి వాటికి సిఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించారా? అంటే మీకో న్యాయం ఇతరులకో న్యాయం అన్నమాట.
శాసనసభలో అల్లు అర్జున్ విషయం ప్రస్తావిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని, సినీ పరిశ్రమని దెబ్బ తీసేవిదంగా వ్యవహరిస్తున్నారు.
గతంలో మజ్లీస్ పార్టీని నమ్ముకొని బిఆర్ఎస్ పార్టీ నిండా మునిగింది. మజ్లీస్ పార్టీని నమ్ముకుని రాజకీయాలు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది,” అని బండి సంజయ్ హెచ్చరించారు.